Breaking News:

రజినీకాంత్ తో చిదంబరం భేటీ!

తమిళనాట రాజకీయాలు మరింత హాట్ గా మారుతున్నాయి. అమ్మ మరణం తరువాత రోజుకో రకంగా మారుతున్న తమిళ పాలిటిక్స్ లో తాజా అప్ డేట్ ఏంటంటే... సూపర్స్టార్ రజనీకాంత్ ను కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి పి.చిదంబరం ఆయన ఇంటిలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏం చర్చించారనేది ఇటు రజినీ అటు చిదంబరం ఎవరూ మీడియాకు వెళ్లడించలేదు. అయితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు చర్చించారని చెప్తున్నారు.

తమిళనాడు రాజకీయవర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్- చిదంబరం భేటీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై వీరిద్దరు చర్చించారని అంటున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి రజనీ మద్ధతు తెలపగా - మరోవైపు కాంగ్రెస్ నేత అయిన చిదంబరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో అని అంతటా చర్చనీయాంశమైంది. రజినీకాంత్  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఈ మధ్య బాగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. ఈ విషయంపై బీజేపీ వర్గాలు సైతం ఆరాతీస్తున్నట్లు సమాచారం. 

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses