Breaking News:
Super User

Super User

చిరు ఒక్కడే - నో బాలయ్య

మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత ఆడియో ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి అతిధిగా రావడం పెద్ద విశేషం కాదు. స్వయానా చిన్నల్లుడు అందులోనూ అతని మొదటి సినిమా కాబట్టి గెస్ట్ గా రావడమే న్యాయం. కాకపోతే బాలకృష్ణ కూడా గెస్ట్ గా లిస్ట్ లో ఉన్నారని నిన్న మొన్న కొన్ని కథనాలు వచ్చాయి. విజేత నిర్మాత సాయి కొర్రపాటి బాలయ్యకు అత్యంత సన్నిహితుడు కావడమే కాక ఎన్టీఆర్ బయోపిక్ లో  నిర్మాణ భాగస్వామి కాబట్టి పిలిచే ఉంటారనే అంచనాలో అలా అనుకున్నారు.

కానీ తాజా సమాచారం మేరకు ఆయన రావడం లేదట. కారణాలు తెలియలేదు  కానీ బయటి ఆడియో వేడుకలకు బాలయ్య అతిధిగా రావడం చాలా చాలా అరుదు. ఎవరో దాకా ఎందుకు ఆయన ఫ్యామిలీ హీరోల వేడుకలకే ఎప్పుడో కానీ రారు. అందుకే విజేతకు సైతం అదే కారణం చూపి సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. సో స్టేజి మీద చిరంజీవినే ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు.  

రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన విజేతను ఫక్తు ఫామిలీ డ్రామాగా తీర్చిదిద్దినట్టు తెలిసింది. టీజర్ లో కూడా అదే రివీల్ చేసారు. చికెన్ మీద పాటను మొదటి ట్రాక్ గా ఇటీవలే విడుదల చేసిన యూనిట్ ఈ రోజు అన్ని పాటలను రిలీజ్ చేయబోతున్నారు. వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీపై అంచానాలు మరీ భారీగా లేవు కానీ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాడా అనే ఆసక్తి అయితే నెలకొని ఉంది. పైగా పోస్టర్స్ తో పాటు టీజర్ లో హీరో మెటీరియల్ ఉన్నవాడిలా అనిపించడంతో కంటెంట్ ఉంటే కనక విజేత బాక్స్ ఆఫీస్  దగ్గర విజేత గా నిలిచే ఛాన్స్ ఉంది.

అసలే చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్ మూవీ టైటిల్ ని పెట్టుకున్నారు. ఆ రకంగా కూడా మెగా ఫాన్స్ దీనికి కనెక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వాడుకుని వరుణ్ తేజ్ హిట్ కొట్టినట్టు చిరు విజేత టైటిల్ తో కళ్యాణ్ దేవ్ కూడా హిట్ కొట్టాలని వారి కోరిక. అయినా మొదటి సినిమాకే ఇన్నేసి అంచనాలు మోయటం కష్టమే కానీ  విడుదల అయ్యాక మెప్పిస్తే కనక అవకాశాలకు లోటు  ఉండదు.

గోపీచంద్ పంతంలో అంత విషయం ఉందంట

చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు హీరో గోపీచంద్. కానీ లౌక్యం తరవాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాపవుతూనే వచ్చింది. ఆరడుగుల బుల్లెట్ సినిమా అయితే ఎంత ప్రయత్నించినా థియేటర్ల వరకు చేరలేకపోయింది. కెరీర్ కు హిట్ అత్యంత అవసరమైన ఈ టైంలో గోపిచంద్ ఆశలన్నీ ప్రస్తుతం చేసిన పంతం సినిమాపైనే ఉన్నాయి.

తన కెరీర్ లో చాలా కమర్షియల్ మూవీస్ - లవ్ స్టోరీస్ చేశానని.. కానీ మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమాలు లేవని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. పంతం ఈ లోటును తీర్చేస్తుందని చెబుతున్నాడు. తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్లో పంతం టీం మొత్తాన్ని ప్రశంసిస్తూనే ఈ సినిమా విషయాలు బయటపెట్టాడు. ‘‘నేను చేసిన 25 సినిమాల్లో మెసేజ్ ఇస్తూ చేసిన చిత్రం యజ్ఞం. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇన్నేళ్ల తరవాత అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ మూవీ డైరెక్టర్ చక్రవర్తి కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. చెప్పినంత బాగా తీయగలవా అంటూ అతడి ముఖంమీదే అడిగేశా. కానీ అతడు మాత్రం సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’’ అంటూ గోపీచంద్ తన లేటెస్ట్ సినిమా విషయాలు చెప్పుకొచ్చాడు. 

ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్య ఈ భామకు కూడా హిట్ లేదు. చేతిలోనూ సినిమాలు ఏమీలేదు.  దీంతో మెహ్రీన్ కూడా పంతంపై చాలా ఆశలే పెట్టుకుంది. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ మూవీ నిర్మించారు. 

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses