Breaking News:

బాహుబలిని బ్లూప్రింట్ తో పోల్చాడు!

తెలుగు తెరపై "బాహుబలి" సినిమా స్థానం ప్రత్యేకం. తెలుగు మొదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజువల్ వండర్ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై స్పందించిన బాలీవుడ్ సెలబ్రెటీలు... ఈ సినిమా అద్భుతమని ఒకరంటే తమకు అవకాశం రానందుకు బాదగా ఉందని మరొకరన్నారు. అనంతరం లేటుగా అయినా లేటెస్టుగా స్పందించాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. 

తాజాగా ఒక ఇంటర్వులో స్పందించిన షారుఖ్... బాహుబలి సినిమాని ఒక బ్లూ ప్రింట్ తో పోల్చాడు. ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాకు బ్లూ ప్రింట్ వంటిదని కితాబిచ్చాడు. ఇదే సమయంలో టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ అయిన వారికి ఎదురయ్యే ప్రశ్న... బాలీవుడ్ కి ఎప్పుడు వెళ్తున్నారని లేదా బాలీవుడ్ సినిమాలు ఎప్పుడు చేస్తారని. సరిగ్గా అదే ప్రశ్న తాజాగా షారుఖ్ కి ఎదురైంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని. ఈ ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు షారుఖ్.

భారతదేశంలో 23 అధికారిక - 1600 అనధికార భాషలున్నాయని మొదలుపెట్టిన షారుఖ్... ఏ భాషలో సినిమా తెరకెక్కినా అది ఫైనల్ గా ఇండియన్ సినిమానే అని అన్నాడు. ఇదే క్రమంలో తాను కూడా వీలైనప్పుడల్లా ఇతర బాషల సినిమాలన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటానని అందులో భాగంగా తాజాగా తెలుగులో "బాహుబలి" చూశానని అన్నాడు. ఆ సమయంలోనే బాహుబలి పై స్పందించిన ఆయన... ఒక అద్భుతమైన సినిమాకు బాహుబలి అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది అని అన్నాడు. అనంతరం అలాంటి సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు? అని ఎదురుప్రశ్నించిన షారుఖ్ - భాష పరంగా తనకు కొన్ని సమస్యలున్నాయని తెలిపాడు. కేవలం ఆ ఒక్క కారణంతోనే ఇతర భాషల్లో సినిమాలు చేయడం లేదు అని వివరించాడు. 

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses