Breaking News:

నమ్రత లుక్.. కొత్తగా ఉందే!!

మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్.. ఈ మధ్యనే గుండు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఒక మొక్కులో భాగంగా తిరుమలలో ఆమె ఇలా గుండు చేయించుకుంది. ఆ లుక్ లో ఎక్కువగా ఫోటోస్ బయటకు రాలేదు కానీ.. అలాగని ఆ విషయాన్ని దాచేయాలనే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. ఇప్పుడు కొంచెం పెరిగిన హెయిర్ తో నమ్రత కొత్తలుక్ లో దర్ళనం ఇచ్చింది.

హైద్రాబాద్ లోనే జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన నమ్రత.. ఇలా కొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించింది. బ్లాక్ అండ్ రెడ్ డిజైనర్ వేర్ లో మహేష్ భార్య సందడి చేసింది. చిన్న స్లీవ్స్ ఉన్న టాప్.. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేసిన బాటమ్.. నమ్రతకు భలే మ్యాచ్ అయ్యాయి. డ్రెసింగ్ తో పాటు.. ఈమె స్టైలింగ్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది. చిన్న ఫంక్షన్స్ కు కూడా ఫ్యాషన్ అండ్ స్టైల్ లో తన నావెల్టీని చూపించే నమ్రత.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసేసింది.

కొడుకు గౌతమ్.. కూతురు సితారలతో పాటు.. భర్త మహేష్ బాబుకు సంబంధించిన వ్యవహారాలను కూడా చక్కబెట్టేసే నమ్రతకు.. తన సొంత స్టైలింగ్ పెద్ద విషయం కాదేమో కదూ!

Last modified onFriday, 09 December 2016 09:59

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses