Breaking News:

'మనం' అక్కడ రీమేక్ అవుతుందట!

తెలుగు సినిమాల్లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన చిత్రం. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం... దాన్లో నాగార్జునతోపాటు నాగ చైతన్య అఖిల్ కూడా నటించడంతో ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి తీపి గుర్తుగా మిగిలిపోయింది. తెలుగు ప్రేక్షకులకు విశేషంగా అలరించింది. నాగార్జున కెరీర్ లోనే నెక్స్ట్  లెవెల్ సినిమా అనే రేంజిలో విజయం సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని ఆ మధ్య టాక్ వచ్చింది. కారణలేంటో తెలీదుగానీ ఆ ప్రతిపాదన సెట్స్ వరకూ వెళ్లలేదు. ఆ తరువాత.. తమిళంలో కూడా హీరో సూర్య రీమేక్ చేస్తాడని అనుకున్నారు. సూర్య తండ్రి శివ కుమార్ - కార్తీలు నటించే అవకాశం ఉందన్నట్టు వార్తలొచ్చాయి. కానీ.. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తో 24 తీశాడు. ఇప్పుడు మలయాళంలో మనం రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు మల్లూవుడ్ చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మనంలో నాగార్జున చేసిన పాత్రలో మమ్ముట్టి నటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత్ర కోసం సీనియర్ నటుడు మధు బాగుంటారని చెప్పుకుంటున్నారు. అలాగే తెలుగులో నాగ చైతన్య చేసిన క్యారెక్టర్ ను మమ్ముట్టి కుమారుడు దుల్కర్ చేసే అవకాశం ఉందట. హీరోయిన్ల విషయానికొస్తే... మనంలో సమంత పాత్రను మలయాళంలో నిత్యా మీనన్ చేస్తుందని అంటున్నారు. తెలుగులో నాగార్జున పక్కన శ్రీయ చేసిన విలేజ్ గాళ్ పాత్రకి మమతా మోహన్ దాస్ సరిపోతుందని భావిస్తున్నారట.

ఇక మనం క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇలానే మలయాళంలో కూడా ఆ పాత్ర కోసం ప్రముఖ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ ను ఎంపిక చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే చర్చలన్నీ ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ఎవరు రీమేక్ చేస్తారు...?  ఈ తారలందరినీ ఎవరు కో ఆర్డినేట్ చేసి ఒప్పిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదే నటీనటుల కాంబినేషన్ అయితే చక్కగా కుదిరినట్టే అవుతుంది. 

Last modified onWednesday, 28 December 2016 09:30

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses