Breaking News:

పవన్ - మహేష్ న్యూ ఇయర్ ప్లానింగ్

రోజులు చకచకా గడిచిపోతున్నాయ్. అల్రెడీ డిసెంబర్ లోకి వచ్చేశాం. న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలా అని స్కెచ్చెస్ వేసుకుంటున్నారు చాలామంది. ఇక హీరో- హీరోయిన్స్ అయితే కొత్త సంవత్సరానికి కొత్త కొత్త ప్రదేశాల్లో స్వాగతం పలకడానికి షూటింగ్స్ కి హాలీడేస్ ఇచ్చేసి మరీ వెళ్లిపోతుంటారు. దానికి తగ్గట్టే సినీ జనాల్లో కూడా అప్పుడే ఇయర్ ఎండింగ్ మూడ్ కనిపించేస్తోంది. త్వరగా షెడ్యూల్ పూర్తి చేసేసి అబ్రాడ్ వెళ్లిపోడానికి ప్రిపేర్ అవుతున్నారు

అలాగని పర్సనల్ ఎంజాయ్ మెంట్ కోసం షూటింగ్స్ ప్లాన్ ని డిస్టబ్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రిన్స్ మహేష్ బాబు తమ తమ యూనిట్స్ కి అప్పుడే ఇన్ఫామ్ కూడా చేసేశారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మేన్ గా పేరున్న మహేష్ ఈ ఏడాది ఇప్పటికే 4-5 ఫారిన్ ట్రిప్స్ వేశాడు. న్యూ ఇయర్ ని సైతం విదేశాల్లో జరుపుకోడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 20 వరకు మురుగదాస్ మూవీ షూటింగ్లో పాల్గొని అట్నుంచి అటు ఫారిన్ వెళ్లిపోతాడు. ఎప్పట్లాగే యూరప్ కంట్రీస్ కి వెళ్తాడా డెస్టెనీ మారుస్తాడో తెలీదు కానీ మళ్లీ జనవరి 2తర్వాతే మహేష్ మొహానికి మేకప్ వేసుకునేది.

ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కొత్త సంవత్సరాన్ని ఫ్యామిలీతో జరుపుకోవాలని డిసైడయ్యాడట. షెడ్యూల్ ని 27కల్లా కంప్లీట్ చేసేయాలని.. ఈ నెల 27 నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు తనతో ఎలాంటి షూట్ ప్లాన్ చేయొద్దని కాటమరాయుడు యూనిట్ కి చెప్పేశాడట. హాలీడేస్ అంటే జనరల్ గా పవన్ కల్యాణ్ ఏ బెంగళూరో.. గోవానో వెళ్తాడు. కానీ ఈ సారి పవర్ స్టార్ కూడా అబ్రాడ్ వెళ్లాలని చూస్తున్నాడట. వీళ్ల రూట్లోనే మరికొందరు కూడా న్యూ ఇయర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.

Last modified onFriday, 09 December 2016 10:05

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses