Breaking News:

టీజర్ టాక్: మెగాస్టార్ స్వీట్ వార్నింగ్

''ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా'' అంటూ మెగాస్టార్ చెబుతూ.. ''ఏ స్వీట్ వార్నింగ్'' అని వార్నింగ్ ఇచ్చేశాడు. బేస్ వాయిస్ లో డైలాగ్ డెలివరీ నుండి.. కళ్ళతోనే పలికించేసే ఆ ఎక్సప్రెషన్ల వరకు.. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ నటవిశ్వరూపం చూపించేశాడు. స్వీట్ గా నేనొస్తున్నా అంటూ రచ్చ చేయడం మొదలెట్టేశాడు.

అనుకున్నట్లే ఈరోజు సాయంత్రం ఖైదీ నెం 150 సినిమా టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ ఫిలిం కావడం.. అలాగే సినిమాను వివి వినాయక్ డైరక్ట్ చేస్తుండటంతో.. సినిమా మీద అంచనాలు చాలా గట్టిగానే ఉన్నాయి. అసలు వినాయక్ మార్క్ టేకింగ్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. కాని ఈ టీజర్ చూశాక మాత్రం.. అది రెట్టింపైందనే చెప్పాలి. అలాగే రత్నవేలు ఫోటోగ్రాఫి.. దేవిశ్రీప్రసాద్ ల మ్యూజిక్ కూడా అద్భుతం అనిపించేలా ఉన్నాయి. మాస్ మసాలా దమ్ము వారి పనితనంలోనే కనిపిస్తోంది. ఇక ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ తరుపున భారీగా ఖర్చు పెట్టాడని అర్దమవుతుందిలే.

అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవిని చాన్నాళ్ళ తరువాత ఇలా చూడటం ఫ్యాన్స్ కు ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. మెగాస్టార్ మరోసారి మేకప్ వేస్తే దాని రిజల్టు ఎలా ఉంటుందో ఒక చిన్న హింట్ ఇచ్చినట్లుంది. పైగా చిరంజీవి కూడా చాలా హ్యాండ్సమ్ గా.. అలాగే ఎంతో ఎనర్జటిక్ గా కనిపిస్తున్నారు. అందుకే ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు మరి. చూస్తుంటే 2017 సంక్రాంతికి ఏదో డబుల్ బ్లాక్ బాస్టర్ కొట్టేలా ఉన్నారే.

Last modified onFriday, 09 December 2016 10:08

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses