Breaking News:

ఎన్టీఆర్ చూపించేది విశ్వరూపం కాదు..

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా చేయాలనే ఆలోచనతో 3 నెలలపాటు వెయిట్ చేసిన ఎన్టీఆర్.. ఎట్టకేలకు బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ యాక్సెప్ట్ చేశాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ మూడు పాత్రలు చేయనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించాడు.

అయితే.. ఈ మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్న జూనియర్.. ప్రతీ పాత్రకు తన నటనలో నావెల్టీని చూపించబోతున్నాడని.. అందుకే ఈ చిత్రానికి నట విశ్వరూపం అనే టైటిల్ పెడతారనే టాక్ వినిపించింది. ఈ టైటిల్ పై నందమూరి అభిమానులు నిరుత్సాహపడ్డారు కూడా. అయితే.. అసలు తమ చిత్రానికి ఇంకా ఎటువంటి టైటిల్ ను పరిశీలించలేదంటూ తేల్చేశాడు కళ్యాణ్ రామ్. 'అసలు టైటిల్ విషయంలో కానీ.. ఇతర నటీనటులు.. సాంకేతిక వర్గం విషయంలో కానీ ఇప్పటివరకూ ఏదీ ఫైనల్ కాలేదు. మీడియాలో వస్తున్న వార్తలేవీ నిజం కాదు' అని చెప్పాడు కళ్యాణ్ రామ్.

ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినట్లుగానే.. అధికారికంగా ఏ కొత్త అప్ డేట్ అయినా తామే చెబ్తామని.. పుకార్లను నమ్మద్దని కోరాడు కళ్యాణ్ రామ్. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses