Breaking News:

గోపీచంద్ పంతంలో అంత విషయం ఉందంట

చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు హీరో గోపీచంద్. కానీ లౌక్యం తరవాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాపవుతూనే వచ్చింది. ఆరడుగుల బుల్లెట్ సినిమా అయితే ఎంత ప్రయత్నించినా థియేటర్ల వరకు చేరలేకపోయింది. కెరీర్ కు హిట్ అత్యంత అవసరమైన ఈ టైంలో గోపిచంద్ ఆశలన్నీ ప్రస్తుతం చేసిన పంతం సినిమాపైనే ఉన్నాయి.

తన కెరీర్ లో చాలా కమర్షియల్ మూవీస్ - లవ్ స్టోరీస్ చేశానని.. కానీ మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమాలు లేవని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. పంతం ఈ లోటును తీర్చేస్తుందని చెబుతున్నాడు. తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్లో పంతం టీం మొత్తాన్ని ప్రశంసిస్తూనే ఈ సినిమా విషయాలు బయటపెట్టాడు. ‘‘నేను చేసిన 25 సినిమాల్లో మెసేజ్ ఇస్తూ చేసిన చిత్రం యజ్ఞం. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ ఇన్నేళ్ల తరవాత అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ మూవీ డైరెక్టర్ చక్రవర్తి కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. చెప్పినంత బాగా తీయగలవా అంటూ అతడి ముఖంమీదే అడిగేశా. కానీ అతడు మాత్రం సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’’ అంటూ గోపీచంద్ తన లేటెస్ట్ సినిమా విషయాలు చెప్పుకొచ్చాడు. 

ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్య ఈ భామకు కూడా హిట్ లేదు. చేతిలోనూ సినిమాలు ఏమీలేదు.  దీంతో మెహ్రీన్ కూడా పంతంపై చాలా ఆశలే పెట్టుకుంది. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ మూవీ నిర్మించారు. 

Last modified onFriday, 22 June 2018 05:59

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses