Breaking News:

ముందు షారూకే చెప్పాడు బాసూ!!

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఈ మధ్య పెద్ద సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కావడం లేదు. ఒకరి కోసం ఎవరో ఒకరు వెనక్కి తగ్గక తప్పడం లేదు. రెండు సినిమాలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నా.. రిపబ్లిక్ డే నాడు మరోసారి ఇలాంటి పోటీ తప్పదనే సంగతి ఇప్పుడు తేలిపోయింది.

జనవరి 25న హృతిక్ రోషన్ నటించిన కాబిల్ ను విడుదల చేస్తున్నట్లు రాకేష్ రోషన్ అనౌన్స్ చేశాడు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే.. తన మూవీ రాయీస్ ను కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్లు చెప్పాడు షారూక్ ఖాన్. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రావడం అంటే.. ఇద్దరికీ నష్టం కలిగించే విషయమే. ఇక్కడో మేటర్ ఏంటంటే.. కాబిల్ సాయంత్రం 6గంటల షో నుంచి విడుదలైతే.. రాయీస్ మాత్రం రెగ్యులర్ షోస్ తోనే వస్తోంది. అయినా సరే.. వివాదాలకు దూరంగా ఉండే కింగ్ ఖాన్.. ఇలా చేశాడేంటబ్బా అని అనుకుంటున్న సమయంలో అసలు విషయం బైటకు వచ్చింది.

'రాయీస్ చిత్రం జనవరి 25న కానీ.. 26న కానీ విడుదల చేస్తాం' అనే మాట షారూక్ నోటి నుంచి ఎప్పుడో వచ్చింది. జూలై 28న షారూక్ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట ఇది. అంటే ఐదు నెలల క్రితమే రాయీస్ రిలీజ్ డేట్ ఇచ్చేసినా.. ఇప్పుడు కాబిల్ రూపంలో హృతిక్ ని ఉద్దేశ్యపూర్వకంగానే పోటీకి పెట్టారనే సంగతి అందరికీ అర్ధమైంది. ఇలాగే మొన్న ఆగస్ట్ 12న అక్షయ్ కుమార్ మూవీ రుస్తోంతో పోటీ పడి.. చివరకు హృతిక్ నటించిన 'మొహెంజొదారో' డిజాస్టర్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు సినిమా జనాలు.

Last modified onFriday, 09 December 2016 09:53

Leave a comment

Make sure you enter the (*) required information where indicated. HTML code is not allowed.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses